న్యాయవాదుల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Jun 17 2026 5:15 AM | Updated on Jun 17 2026 5:15 AM

జడ్చర్ల టౌన్‌: మహబూబ్‌నగర్‌ న్యాయవాది నరేందర్‌ నాయక్‌పై దాడి, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదును వ్యతిరేకిస్తూ మంగళవారం జడ్చర్ల కోర్టులో న్యా యవాదులు విధులు బహిష్కరించారు. బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు యాదిరెడ్డి ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చినప్పటికీ న్యాయవాదులపై దాడులు జరగటం, బాధిత న్యాయవాదిపైనే కేసు నమోదు చేయటం సబబుకాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాములు, న్యాయవాదులు తిరుపతి, జంగయ్య, లక్ష్మీనారాయణ, పాండు, పురుషోత్తం, శ్రీశైలం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement