మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు జిల్లా విద్యార్థులు సోమవారం ఇక్కడి నుంచి బయలుదేరారు. అమ్మాయిల విభాగంలో వినూత్న 28 కేజీ, అన్విత రెడ్డి 33 కేజీ, అర్ఫా ఫాతిమా 37కేజీ, రిత్విక 36కేజీ, అబ్బాయిల విభాగంలో రాహుల్ 37 కేజీ, దీక్షిత్ 42 కేజీ, శివప్రసాద్ 63 కేజీ, రేవంత్ 37 కేజీ, విశాల్ 47 కేజీ విభాగంలో పాల్గొంటారు. అంతకుముందు వీరిని జిల్లా కేంద్రంలోనని ప్రధాన స్టేడియంలో జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్‌ఓ) రాజశేఖర్ రెడ్డి అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనంద్, అథ్లెటిక్ కోచ్ సునీల్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడురవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, కోచ్‌లు యా మిని, జయదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


