
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
మహబూబ్‌నగర్ రూరల్: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని ఎదిరలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దొడ్డి కొమురయ్య ఆత్మ బలిదానంతో దేశవ్యాప్తంగా భూ సమస్యలపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఽభవిష్యత్‌లో పిల్లలు కుల వృత్తితో పాటు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరి ఏదైనా నైపుణ్య శిక్షణ పొందాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని.. రాజకీయాల పేరుతో గ్రామాలను విచ్ఛినం చేయరాదని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అంతకుముందు రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం రూ.50 లక్షలతో నిర్మించనున్న కురుమ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, శివశంకర్, శాంతన్నయాదవ్, నాయకులు శ్రీశైలం, జె.చంద్రశేఖర్, శివప్రసాద్‌రెడ్డి, చర్ల శ్రీనివాసులు, రాములు, బచ్చన్న, కర్నె కృష్ణయ్య, అంజి, నర్సింహులు, ఎల్లయ్య పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ:
ఇద్దరి దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలైన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కౌకుంట్లకు చెందిన నజీర్(25) బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ నుంచి కౌకుంట్లకు వెళ్తుండగా, మాచన్‌పల్లి తండాకు చెందిన శ్రీను(30), మోహన్ కలిసి దేవరకద్ర వైపు నుంచి మహబూబ్‌నగర్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో ధర్మపూర్ సమీపంలో వేగంగా ఎదురెదురుగా బైక్‌లు ఢీకొట్టుకోవడంతో నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మోహన్‌కు గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఇటిక్యాల: మండల పరిదిలోని ఉదండాపురం గ్రామ శివారులో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకునట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. మూడు బైక్‌లు, రూ.29,850 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బంగారు దుకాణంలోపట్టపగలే చోరీ
రాజోళి: శాంతినగర్ పట్టణంలోని ఓ బంగారు దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిగనర్‌లోని శ్రీనివాస జ్యూవెలర్స్ యజమాని శ్రీనువాసులు రోజు లాగానే గురువారం ఉదయం దుకాణం తెరిచారు. వెంట తెచ్చుకున్న బ్యాగును షాపులో ఉంచి అటు వైపు తిరిగి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బ్యాగును తీసుకొని బైక్‌పై పరారయ్యారు. తేరుకున్న యజమాని కేకలు వేసే లోగా దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్యాగులో రూ.4 లక్షల నగదు, రెండు కిలోల వెండి ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.