
అర్హులందరికీ ‘ఇందిరమ్మ ఇళ్లు’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: అర్హులందరికీ ‘ఇందిరమ్మ ఇళ్లు’ ఇస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంపికై న 1,437 మంది లబ్ధిదారులకు జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో గురువారం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం వీరన్నపేట, రైల్వేస్టేషన్ రోడ్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మయూరి కో–ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ను మొదటి స్థానంలో నిలిపేందుకు తమ సహకారం, తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ఈనెలాఖరులో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. అనంతరం ఈనెల 4న హైదరాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఇక హృద్రోగ సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జిల్లాకేంద్రానికి చెందిన మనపతి హర్షిత కోసం రూ.4 లక్షలు, అలాగే అక్కడే అనారోగ్యంతో బాధతున్న దివిటిపల్లి వాసి ముతుకూరి బాలమణి కోసం రూ.1.70 లక్షల విలువ జేసే ఎల్‌ఓసీలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, వైస్‌చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్‌అహ్మద్, కాంగ్రెస్ నాయకులు జహీర్‌అక్తర్, సంజీవ్ ముదిరాజ్, ఎస్.వినోద్‌కుమార్, ఎన్.పి.వెంకటేష్, ఎం.సురేందర్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, అవేజ్. సీజే బెన్‌హర్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.