
పరికరాలు బాగు చేయాలి
హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ జిమ్‌కు అప్పుడప్పుడు వస్తుంటాను. ఫిట్‌నెస్ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు బాగానే ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే కుర్చీలాట యంత్రం విరిగిపోయి చాలా రోజులైంది. దాని బాగు చేస్తే సమీపంలోని విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు. సిమెంట్ బల్లా కూడా బాగు చేయించాలి. – వేముల శివ,
పద్మావతికాలనీ, మహబూబ్‌నగర్
లైట్లు సరిగా వెలగవు
ఇక్కడి ఓపెన్ జిమ్‌లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు సరిగా వెలగడం లేదు. బయ ట ఓ మూలన కొందరు చెత్తాచెదారం పడేస్తు న్నారు. పారిశుద్ధ కార్మికులతో ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రాత్రివేళ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలి. – నాని,
హౌసింగ్ బోర్డు కాలనీ వాసి, మహబూబ్‌నగర్
పరిశీలించిమరమ్మతు చేపడతాం
నగరంలోని అన్ని పార్కులతోపాటు ఓపెన్ జిమ్‌లను త్వరలోనే పరిశీలిస్తాం. ఎక్కడైనా పరికరాలు మరమ్మతుకు గురైనవి ఉంటే బాగు చేయిస్తాం. ఈ పాటికే టీచర్స్‌కాలనీలోని చిల్డ్రన్స్ పార్కు, పాలకొండ, మర్లులో పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఆయా చోట్ల చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్‌నగర్
●

పరికరాలు బాగు చేయాలి