
విత్తన పత్తి..!
● విత్తిన నెల తర్వాత సీలింగ్ పేరిట బెదిరింపులు
● ఎకరాకు 200 పాకెట్లే కొంటామని మెలిక
● నిర్దేశిత గడువులోపు డబ్బులు చెల్లించకుండా దాటవేత
● పైగా ఆ మొత్తం ఇచ్చే వరకూ వడ్డీ వసూలు
● రైతు సంక్షేమ కమిషన్‌కు బెదిరేది లేదని ఆర్గనైజర్ల ఽసంకేతాలు?
● ఉమ్మడి పాలమూరులో 55వేల మంది రైతుల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీడ్ పత్తి సాగులో ఉమ్మడి పాలమూరులోని నడిగడ్డ (జోగుళాంబ గద్వాల జిల్లా)ది ప్రత్యేక స్థానం. ఇక్కడి నుంచే ఏటా సుమారు రూ.1,500 కోట్ల మేర విత్తనాల వ్యాపారం కొనసాగుతోంది. దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయిన సీడ్ గింజలే సరఫరా అవుతాయి. అంతేకాదు.. చైనాతో పోటాపోటీగా ఇక్కడి రైతులు విత్తన పత్తి పంట సాగు చేస్తున్నట్లు రైతు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి సీడ్ పత్తి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల ఆగడాలు వెరసి నిలువు దోపిడీకి గురవుతున్న విత్తన పత్తి సాగు దారుల దీనస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
రాజకీయ నాయకులే ఆర్గనైజర్లు..
నడిగడ్డలో మూడు దశాబ్దాలుగా సుమారు 40వేల మంది రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని – మిగతా 4వ పేజీలో
రైతులతో కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల చెలగాటం

విత్తన పత్తి..!