
పీయూలో వసతుల లేమి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎదుర్కొంటున్న అనేక సమస్యలను రాష్ట్ర విద్యా కమిషన్ ఆలకించింది. ఉన్నత విద్యలో సమూల మార్పులు, బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, పలువురి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు పీయూ వేదికగా ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్‌రావు, జోష్నశివారెడ్డి, చారకొండ వెంకటేష్, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు పాల్గొనున్నారు. సుమారు 70 – 80 మంది అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఈ క్రమంలో పలువురు అధ్యాపకులు సిలబస్ మార్పులు, యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలల్లో వసతుల లేమి, సిల్స్, తదితర అంశాలపై చర్చించారు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ, కళాశాలలు అందులో వసతులు, తరగతి గదులు, ల్యాబ్స్, బాలికల హాస్టల్స్ తదితర సమస్యలను ఏకరువు పెట్టారు.
– వివరాలు 4వ పేజీలో..
ఉన్నత విద్య
బలోపేతానికి కృషి..
రాష్ట్రంలో అన్నిస్థాయిలో ఉన్నత విద్య బలోపేతానికి ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్, పాఠశాల విద్యలపై పబ్లిక్ హియరింగ్స్‌లో పాల్గొన్నామన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి మొదటి సారి పీయూలో సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, సంఘాలు చాలా సూ చనలు చేశాయని, వాటిని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి కమిషన్ ఒక ముసాయి దాను ప్రభుత్వానికి పంపించిందని, దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం, సీఎం ప్రాథమిక స్థాయి విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్నిస్థాయిలో విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా క మిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు.
హాస్టళ్లలో మౌలికసదుపాయాలు కరువు
తరగతి గదులు, ల్యాబ్స్, ఎక్విప్‌మెంట్స్ లేక చదువులపై ప్రభావం
ఉద్యోగ భద్రత లేక టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది పాట్లు
విద్యార్థులు, పీయూ సిబ్బందితోముచ్చటించిన విద్యా కమిషన్
అన్ని సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడి