
నారుమడిలో యాజమాన్య పద్ధతులు
నాటు వేసుకునే విధానం...
నాటు వేసే నారులో ఆకు లేతగా, ఆకుమచ్చ గడ ఉంటే చేసు తొందరగా తిరుగబెడుతుంది. 4 నుంచి 6 ఆకులు ఉన్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నారు లోతులో కాకుండా ౖపైపెన నాటితే ఎక్కువగా పిలకలు వచ్చే అవకాశం ఉటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని బట్టి వానాకాలంలో చదరపు మీటర్‌కు 44 దంట్లు (నారు మొలకలు) ఉండేలా నాటుకోవాలి.
కోస్గి: అధునాతన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ.. విత్తన శుద్ధి చేసి తగు జాగ్రత్తలతో వరి నారుమడి వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వరిసాగు చేసే రైతులు నారు పోసుకునేందుకు కరిగెట్టు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది వానాకాలంలో ప్రధానంగా బీపీటీ, తెలంగాణ సోనాతో పాటు వివిధ రకాల సన్న రకం వరి విత్తనాలను సాగు చేసుకోవడంతో దిగుబడి బాగుండడంతో పాటు ధాన్యం అమ్ముకునే విషయంలో ఇబ్బందులు ఉండవన్నారు.
విత్తన శుద్ధి..
నారు పోసే ముందు విత్తన శుద్ది చేస్తే పలు రకాల కీటకాలు, తెగుళ్లు ఆశించకుండా నివారించుకోవచ్చు. కిలో విత్తనాలను 2.5 గ్రాముల కార్బండిజమ్‌తో కలిపి 24 గంటలు నానబెట్టాలి. లేదా కిలో విత్తనాలకు 3 గ్రాముల కాస్టన్ మందు కలిపి మడిలో చల్లుకోవాలి. దీనివల్ల నారుమడిలో ఆకుతినే పురుగు, ఉల్లికోడు, మువ్వ పురుగు ఆశించకండా ఉంటాయి.
నారుమడి తయారీ..
● నారు పోయాల్సిన మడిని 10 నుంచి 12 రోజుల్లో మూడు దఫాలుగా దున్ని చదును చేయాలి. నీరు పెట్టడానికి, ఎక్కువైతే తీయడానికి అనుకూలంగా ఎత్తుగా నారుమడులు తయారు చేసుకోవాలి.
● ఎకరా పొలం నాటడానికి 5 సెంట్లు (500 చదరపు మీటర్లు) నారుమడి అవసరం. సెంటు భూమికి 5 కిలోల విత్తనాలు వాడాలి.
● 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్ ఉండే ఎరువులు వాడాలి.
● సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులను వాడితే తక్కువ ఖర్చుతో పాటు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు.
నారులో కలుపు నివారణ
● నారుమడిలో కలుపు నివారణకు ఎకరాకు బూటాక్లోర్ 1.5 లీటర్లు, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 లేదా 8వ రోజున మడిలో నీటిని తొలగించి పిచికారీ చేయాలి.
● విత్తిన 10 రోజుల్లో కార్బోప్యూరాన్ 3జీ గుళికలు సెంటు నారుమడికి 150 గ్రాముల చొప్పున వేయాలి. లేదా మోనో క్రోటోపాస్ 1.6 మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి విత్తిన 10 రోజులకు పిచికారి చేయాలి.
● విత్తిన 15 రోజులకు సైహాలోపాస్ బ్యూబైట్ 10 శాతం మందు 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటిలో 2 గ్రాముల జింక్ పాస్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
● నారు 20 నుంచి 25 రోజుల వయస్సున్నప్పుడు 4 నుంచి 6 ఆకుల దశలో నాటుకోవడం వల్ల దిగుబడి అధికంగా వస్తుంది.
పాడి–పంట
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ

నారుమడిలో యాజమాన్య పద్ధతులు