ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం

Jun 27 2025 4:43 AM | Updated on Jun 27 2025 4:43 AM

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎం.సునీతారావు విమర్శించారు. జిల్లాకేంద్రంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం జైబాపు జైభీమ్‌ జైసంవిధాన్‌ కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ చౌరస్తా వరకు చేరుకొని సిలిండర్లను ప్రదర్శించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సామాన్యుడి నడ్డివిరిచే విధంగా సిలిండర్‌ ధర 50 రూపాయలు పెంచారని విమర్శించారు. చీరలు, చిన్నారులు ఉపయోగించే పెన్సిళ్లు, పాలపై కూడా కేంద్రం జీఎస్‌టీ విధిస్తోందని విమర్శించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, సన్న వడ్లకు రూ.500 బోనస్‌, రైతు భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వసంత, జిల్లా ఇన్‌చార్జీలు సుకన్య, వెంకటసుబ్బమ్మ, అరుణ, జిల్లాలోని పట్టణ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. అనంతరం స్థానిక మోనప్పగుట్టలో సునీతారావు, తదితరులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సన్నబియ్యంతో భోజనం చేశారు.

రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎం.సునీతారావు

జిల్లాకేంద్రంలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement