
వచ్చేనెల 11న రాష్ట్రస్థాయి సెమినార్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వచ్చే నెల 11 నుంచి 12 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వర్క్‌షాప్ బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పీయూ పరిధిలో మారిన నూతన సిలబస్, నూతన విద్యావిధానం లక్ష్యాలు, పరిశోధన ఆధారిత బోధన, రీసెర్చి మెథడాలజీ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యాపకులకు అవగాహన కల్పిస్తామన్నారు. నాణ్యమైన ఆవిష్కరణ పద్ధతులను నొక్కి చెప్పే ప్రస్తుత విద్యా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని అధ్యాపకుల సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎంఈడీ కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, హెచ్‌ఓడీ ఆంజనేయులు, ఓయూ ప్రొఫెసర్ సుజాత, దుర్గేశం, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీయూ నాన్‌టీచింగ్ ఉద్యోగి బుర్రన్నను వీసీ పరామర్శించారు.
సుంకేసులకు 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు సోమవారం ఎగువ నుంచి 4,496 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని అంతే స్థాయిలో రెండు గేట్లను తెరిచి దిగవకు వదిలినట్లు చెప్పారు. అలాగే కేసీ కెనాల్‌కు మరో 159 క్యూసెక్కులను వదిలినట్లు వివరించారు.