
కల్యాణ వైభోగమే..
● 25 నుంచి
పెళ్లి సందడి షురూ..
● తలంబ్రాలకు వేళాయె
కాజీపేట: మరో రెండు రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25న శ్రావణ మాసం మొదలు.. నవంబర్ చివరి వరకు పెళ్లి సందడి నెలకొననుంది. దీంతో బంగారు ఆభరణాలు, దుస్తుల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారనున్నాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లు అడ్వాన్స్ బుక్ అయ్యాయి. దాదాపు 6 వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితుల అంచనా. కాగా జీవితంలో ఒకేసారి జరిగే వేడుక అనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10లక్షలకు తగ్గకుండా ఖర్చు చేస్తున్నారు.