మాకు సొంత భూమి లేదు. కౌలుకు 6.50 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈ సారి పత్తి సాగు చేశా. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి చేయూత లేదు. గత ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టడం బాధాకరం. బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు.
– శేషన్న, జి.సింగవరం, కర్నూలు మండలం
మేం దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. మాకు ఐదు ఎకరాలకు సీసీఆర్ కార్డును ప్రభుత్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఈ సారి కూడా అన్యాయం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సాగులో ఎలా రాణిస్తాం? ఇప్పటికై నా చంద్రబాబు చొరవ తీసుకొని కౌలురైతులకు న్యాయం చేయాలి.
– జంగం జంబులింగయ్య,
ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం
పింఛన్లు, భూ రీసర్వే అర్జీలే అధికం
● తుగ్గలిలో పీజీఆర్‌ఎస్
తుగ్గలి: ఒకనెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనల్లో భాగంగా రెండో శుక్రవారం తుగ్గలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా భూ రీసర్వే చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని అధికంగా అర్జీలు వచ్చాయి. పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్, జేసీ, అధికారులు ప్రత్యేక బస్సుల్లో తుగ్గలికి చేరుకున్నారు. పీజీఆర్‌ఎస్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు ఇవ్వగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జేసీ నూరుల్ ఖమర్, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరిశీలించారు. అర్జీలపై వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీలను తిరస్కరిస్తే అందుకు కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. తమ పెద్దల నుంచి సంక్రమించిన 1.85 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓఆర్ కేసు పరిష్కరించాలని కోరినా పరిష్కారం కాలేదని తుగ్గలికి చెందిన రవీంద్రనాథశర్మ పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకున్నారు. పత్తికొండ ఆర్డీవో సీహెచ్ ఓబులేసు, తహసీల్దార్ రవి, సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ
కర్నూలు సిటీ: ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ లభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆంఽధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతులు ఇవ్వడంతో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు గోరంట్లప్ప, జిల్లా కమిటీ సభ్యులు టీ.జి ప్రసాద్, చంద్రమోహన్, నగర అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్, ఎర్రమల హర్షం వ్యక్తం చేశారు.
2,94,598
గత వైఎస్సార్‌సీపీ
ప్రభుత్వంలో
‘రైతు భరోసా’
అందుకున్న అన్నదాతలు
కొంత మందికే అన్నదాత సుఖీభవ!
కౌలు రైతులకు మొండి చేయి
కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన
వారికి అందని పెట్టుబడి సాయం
గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో
రైతులందరికీ భరోసా
ప్రస్తుతం 2,72,757 మందికే లబ్ధి
నేడు అన్నదాత సుఖీభవ,
పీఎం కిసాన్ సాయం విడుదల


