ప్రాణాలను ‘లెక్క’ పెట్టకుండా.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలను ‘లెక్క’ పెట్టకుండా..

Jun 20 2026 11:07 AM | Updated on Jun 20 2026 11:07 AM

చిత్రంలో కనిపిస్తున్న ఆటోలో ఉన్న వారంతా మహిళలే.. డ్రైవర్‌ మినహా. అందులో సాధారణంగా పది మందికి మించి ప్రయాణించడం కష్టం. అలాంటిది.. 10.. 15.. 20 మంది కూడా కాదు.. ఏకంగా 35 మంది ఉన్నారు. పనుల కోసం వారంతా ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఆటోలో వెళ్తూ కనిపించారు. దేవనకొండ మండలంలోని నునుసరాళ్ల నుంచి కొందరు మహిళలు వ్యవసాయ పనులకు ఆటో నిండా టాప్‌ పైఎక్కి తువ్వదొడ్డికి బయలుదేరారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నా ఎవరిలో మార్పు కనిపించడం లేదు. కుటుంబానికి వెలుగులైన మహిళలూ.. ఏదైనా జరగరానిది జరిగితే.. ఎవరిది బాధ్యత. మీకో కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదకర ప్రయాణం వద్దు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement