చిన్న చూపు చూస్తోంది!
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా.. 18 నెలల కాలంలో ఒక్కటి ఇచ్చింది. పీఆర్‌సీ లే దు. మధ్యంతర భృతిని పట్టించుకోవడం లేదు. పదవీ విమరణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వ డం లేదు. నాలుగు విడతల సరండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఇవ్వకపోయినా జీతాలైన సకాలంలో చెల్లిస్తుందా అంటే అది కూడా లేదు. ఇది ఉద్యోగులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. దాదాపు 20 శాఖల ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. బ్యాంకుల్లో పైన్‌లతో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం జరిమానాలను భరించాల్సిందే.
– రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు, ఏపీఎన్‌జీజీవోస్ అసోషియేషన్, కర్నూలు


