రిజర్వాయర్ల విస్తరణ జరగాలి | - | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్ల విస్తరణ జరగాలి

Mar 24 2025 5:59 AM | Updated on Mar 24 2025 6:00 AM

ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. జనాభా పెరిగిన నేపథ్యంలో చింతకుంట, బాపురం రిజర్వాయర్లను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్ల లీకేజీలతో అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. అలాగే ఆలూరు చెరువు అన్యాక్రాంతం కాకుండా ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించాల్సి ఉంది. అలాగే సమ్మతగేరిలో ఎస్‌ఎస్‌ ట్యాంకు, జే హొసళ్లి, బండగట్టులో ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు నిర్మించాలి. దేవనకొండ మండలం కొత్తపేట, పుల్లాపురం గ్రామాలకు పైప్‌లైన్‌ వేయాలి. పందికోన రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ వేస్తే ఆస్పరి మండలంలోని పలు గ్రామాల నీటి సమస్య తీరే అవకాశం ఉంటుంది.

– బీ విరూపాక్షి , ఆలూరు ఎమ్మెల్యే

శాశ్వత పరిష్కారం

చూపాలి

ఆస్పరి మండలంలోని జొహరాపురం గ్రామానికి శాశ్వత మంచినీటి పరిష్కారం చూపాలి. పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అనేక సంవత్సరాలుగా గ్రామంలోని వక్కిరేణి నీటిని తాగుతూ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక ట్యాంకర్‌ రూ.800 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గ్రామ సమీపంలో రిజర్వాయర్‌ నిర్మించి హంద్రీనీవా కాలువ నుంచి పైప్‌లైన్‌ ద్వారా నిల్వ చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

– చంద్ర, జొహరాపురం, ఆస్పరి మండలం

చర్యలు చేపడతాం

ప్రస్తుత వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడికి గురయ్యే గ్రామాలను ఇప్పటికే క్షేత్ర స్థాయిలోని అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని గుర్తించాం. ఆయా గ్రామాల ప్రజల నీటి కష్టాలను తొలగించేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడతాం. అవసరమున్న జనవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణను రూపొందించాం. ఎల్‌ఎల్‌సీకి నీరు బంద్‌ కాకముందే మరోసారి కెనాల్‌ పరిధిలోని ఎస్‌ఎస్‌ ట్యాంకులన్నింటినీ నింపుకుంటాం. ఇప్పటికే వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.6.91 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

– బీ నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

రిజర్వాయర్ల  విస్తరణ జరగాలి  
1
1/2

రిజర్వాయర్ల విస్తరణ జరగాలి

రిజర్వాయర్ల  విస్తరణ జరగాలి  
2
2/2

రిజర్వాయర్ల విస్తరణ జరగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement