కర్నూలు(అగ్రికల్చర్): ఎప్పుడూ ఒకే పంట వేస్తుండటంతో చీడపీడల బెడద పెరుగుతుందని, విధిగా పంట మార్పిడి చేపట్టే విధంగా రైతులను ప్రోత్సహించాలని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారావు సూచించారు. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో దేశీ డిప్లొమా కోర్సు కింద ఇన్‌పుట్ డీలర్లకు ఆదివారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వేసవి దుక్కుల ప్రాధాన్యతపై అవగాహన పెంచాలన్నారు. ఎకరానికి 5 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విశ్రాంత జేడీఏ జయచంద్ర పలు సూచనలు చేశారు.