నంద్యాల: జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో 2023–24 సంవత్సరానికి నూతన జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితితో జిల్లాలోని జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్లు ఇచ్చామన్నారు. నిబంధనల ప్రకారం మొదటి విడతలో 305 మందికి మంజూరు చేశామని, రెండో విడతలో మిగిలిన వారికి అందజేస్తామన్నారు.
6న ఔత్సాహిక పారిశ్రామిక
వేత్తలకు అవగాహన
కర్నూలు కల్చరల్: భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడీబీఐ) సౌజన్యంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నీరజ తెలిపారు. కర్నూలు నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాలలో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు 6వ తేదీ ఉదయం 9 గంటలకు కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని సదస్సులో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 90146 85904 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.