
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ప్రవేశ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. భ్రాంచ్‌లతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఈ కోర్సు ఉపయోగపడుతుంది. గేమ్‌ని తయారు చేయాలంటే దానికి కావాల్సిన కోడ్‌ను ఏఐ తయారు చేసి ఇవ్వగలదు. పోలీసులు కూడా క్రైం నియంత్రణకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. సివిల్,విభాగంలో భవనాలను విన్నూత్న రీతిలో ఇది డిజైన్ చేసి ఇస్తుంది.
– నిఖిల్ (సివిల్, 3వ సంవత్సరం)
సాంకేతిక విప్లవం
ఏఐతో సాంకేతిక విప్లవంతో అగ్రగామికి వెళ్లింది. రాబోయ వృద్ధిని అంచనా వేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. పారిశ్రామిక రోబోట్‌లు, స్వయం ప్రతిపత్తి వాహనాలు, డ్రోన్‌లు, ఆటోమేటెడ్ సిస్టమ్‌లను రూపొందించడం, నియంత్రించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. మెకానికల్ విభాగంలో చూసుకుంటే వాహననం భాగాలు, డిజైన్‌లను కొత్త పద్ధతిలో నిర్మాణం చేసి ఇవ్వగలదు.
– ఎ.వీణా, (ఈసీఈ, 3వ సంవత్సరం)
●
