
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్సు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అదే రాయలసీమ యూనివర్సిటీలో నామ మాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.
– హరిప్రపాద్ రెడ్డి
(ప్రిన్సిపాల్, ఇంజినీరింగ్ కాలేజీ)
జీవన ప్రమాణాలను
మెరుగుపరుస్తుంది
జాతీయ విద్యావిధానంలో ఆర్టిషీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు భాగమైంది. రాబేయే రోజుల్లో ఏ కోర్సు చదివా ఉద్యోగం చేయాలంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరమవుతుంది. అన్ని రంగాల్లో ఈ కోర్సు తనదైన ముద్ర వేసి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ టెక్నికల్ కోర్సులే మిగతా వాటికి కూడా ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో గణిత శాస్ట్రం చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
–ఆచార్య సుందరానంద పుచ్చ
(రిజిస్ట్రార్, రాయలసీమ విశ్వవిద్యాలయం)
