బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి | - | Sakshi
Sakshi News home page

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

Jun 7 2025 1:44 AM | Updated on Jun 7 2025 1:44 AM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌ చాంబర్‌లో కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ (సిఆర్‌ఏఎఫ్‌) ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ లక్ష్మీశ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా టాస్క్‌ పోర్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా ఈ నెల 30వ తేదీ వరకు కార్మిక, పోలీస్‌, స్వచ్ఛంద సంస్థలు ,రెవెన్యూ, శాఖల అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించాలని సూచించారు. బాల, కౌమార కార్మిక నిషేధం, నియంత్రణ చట్టం మేరకు 14 సంవత్సరాల లోపు బాలలను, 14 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారిని ప్రమాదకర పనుల్లో పెట్టడం నేరమని స్పష్టం చేశారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణలో ఉప కార్మిక కమిషనర్‌ సి.హెచ్‌.ఆశారాణి, ఐసీడీఎస్‌ పీడీ డి. శ్రీలక్ష్మీ, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ యం.రాజేశ్వరరావు, వాసవ్య మహిళామండలి డాక్టర్‌ వి.కీర్తి, సీఆర్‌ఏఎఫ్‌ ప్రతినిధి ప్రభాకర్‌, ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ సభ్యులు ఎ.రమేష్‌, సహాయ కార్మిక అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement