
గాలి వానతో ఇబ్బందులు పడినా.. సజావుగానే పరీక్ష
కలెక్టర్ పరిశీలన..
విజయవాడలో జరిగిన నీట్ పరీక్షను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. నగరంలోని పీఎస్‌సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థుల బయో మెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డెప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైనందుకు అభినందనలు తెలిపారు.