
ముంపులోనే పంటలు
రావులపల్లి శివారులో మునిగిన పత్తి పంట
దహెగాం/పెంచికల్‌పేట్: ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పలు మండలాల్లో పంటలు మూడు రోజులుగా నీట మునిగే ఉన్నాయి. దహెగాం మండలంలో ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాలైన మొట్లగూడ, రాంపూర్, రావులపల్లి, పెంచికల్‌పేట్ మండలం మురళీగూడ, జిల్లెడ గ్రామాల శివారులో సాగు చేసిన పత్తి పంట మూడు రోజులుగా వరదలోనే ఉంది. మొక్కలు మురిగిపోతాయని రైతులు వాపోతున్నారు. దహెగాం మండలంలో 900 ఎకరాలు, మురళీగూడ, జిల్లెడ శివారులో 200 ఎకరాలు వరదనీటితో దెబ్బతిన్నట్లు అన్నదాతలు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. త్వరగా సర్వే నిర్వహించి పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
మురళీగూడ శివారులో మునిగిన పంటలు

ముంపులోనే పంటలు