
చట్ట పరిధిలో బాధితులకు న్యాయం
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఫిర్యాదులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసుశాఖ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.