గవర్నమెంట్‌లో క్వాలిఫైడ్‌ టీచర్లు | - | Sakshi
Sakshi News home page

గవర్నమెంట్‌లో క్వాలిఫైడ్‌ టీచర్లు

Jun 12 2025 3:21 AM | Updated on Jun 12 2025 3:21 AM

గవర్న

గవర్నమెంట్‌లో క్వాలిఫైడ్‌ టీచర్లు

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆసిఫాబాద్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల(బాలుర)లో ఇంగ్లిష్‌ సబ్జెక్టు బోధిస్తున్నా. ఇదే పాఠశాలలో నేను 1976– 1982 వరకు చదువుకున్నా. చదువు చెప్పే సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గవర్నమెంట్‌ స్కూళ్లలో క్వాలిఫైడ్‌ టీచర్లు ఉంటారు. అప్పటి గురువులు నేర్పిన విద్యతోనే ఈ స్థాయికి ఎదిగాను.

– మంథెన మహేశ్‌, ఆసిఫాబాద్‌

ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య

ఆసిఫాబాద్‌అర్బన్‌: పిల్లలను భావిపౌరులుగా తీర్చిదిద్దే బోధన వృత్తిలో ఉండటం సంతృప్తినిస్తుంది. నేను చదువుకున్న పాఠశాలలోనే జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుంది. క్రమశిక్షణ, జీవిత పాఠాలు ఇక్కడే నేర్పుతారు.

– పెండ్యాల సురేశ్‌కుమార్‌, ఆసిఫాబాద్‌

నేలపై కూర్చుని పాఠాలు విన్నా..

కాగజ్‌నగర్‌రూరల్‌: మా సొంత గ్రామం రెబ్బెన మండలం కిష్టాపూర్‌లో ఒకటో తరగతి నుంచి ఐదు వరకు గూనపెంకుల గదిలో విద్యాభ్యాసం పూర్తిచేశా. అప్పట్లో నేలపైనే కూర్చుని పాఠాలు విన్నాం. అప్పటి బోధన పటిష్టంగా ఉండేది. మధ్యాహ్నం గోధమ ఉప్మా, పల్లీపట్టి ఇచ్చేవారు. ఇంద్రసేన్‌, విజయ్‌, కృష్ణభాస్కర్‌ అనే టీచర్లు ఎంతో ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన తాండూర్‌ మండలం రేచినీ పాఠశాలకు వెళ్లి పదోతరగతి పూర్తిచేశా. అప్పట్లోనే పదో తరగతిలో పాఠశాల ఫస్ట్‌ వచ్చా. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ కళాశాలల్లోనే ఇంటర్‌, డిగ్రీ చదివా. చదువుకున్న డిగ్రీ కాలేజీలోనే ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేయడం గర్వంగా ఉంది. 2010లో అధ్యాపకుల పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించా.

– లక్ష్మీనరసింహ, వైస్‌ప్రిన్సిపాల్‌,

కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

గవర్నమెంట్‌లో   క్వాలిఫైడ్‌ టీచర్లు
1
1/2

గవర్నమెంట్‌లో క్వాలిఫైడ్‌ టీచర్లు

గవర్నమెంట్‌లో   క్వాలిఫైడ్‌ టీచర్లు
2
2/2

గవర్నమెంట్‌లో క్వాలిఫైడ్‌ టీచర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement