ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో ఈనెల 28, 29, 30వ తేదీల్లో రైతు మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు రైతుమేళా నిర్వహించనుండగా, చివరిరోజు జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈమేరకు రైతు మేళాలో 150 స్టాళ్ల ఏర్పాటు, రైతుల సమీకరణపై దృష్ట్టి సారించాలని సూచించారు. అలాగే, ఇతర జిల్లాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలకు బస, రవాణా సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీరామ్, జిల్లా వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, మత్స్యశాఖల అధికారులు డి.పుల్లయ్య, డాక్టర్ పురంధర్, మధుసూదన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
30న సభకు హాజరుకానున్న సీఎం


