పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈసారి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు రూట్ మ్యాప్ ప్రకటించారు. ఖమ్మం నగర పరిధిలో ఏడు కేంద్రాలు ఉండగా... కాల్వొడ్డు, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్టాండ్ వరకు నడిచే లోకల్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఇవేకాక నీట్ హాల్‌టికెట్ ఉన్న విద్యార్థులకు ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


