వాహనం ఢీకొని నక్కకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని నక్కకు గాయాలు

Jun 20 2026 11:19 AM | Updated on Jun 20 2026 11:19 AM

హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని కనహోసహళ్లి, హులికెరె మధ్య విజయనగర దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ నక్క గాయపడింది. హైవే ట్రూపర్ల బృందం, హైవే పెట్రోల్‌, అటవీ వాఖ అధికారులు, స్థానిక పోలీసులు, స్థానికుల సహయంతో ఆ నక్కను రక్షించారు. పశు వైద్యులతో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కమలాపూర్‌ జూకు తీసుకువెళ్లారు. గాయపడిన నక్క పొదల్లో దాక్కోవడంతో అటుగా వెళ్తున్న హైవే ట్రూపర్లు మహేష్‌, దయానంద్‌ సజ్జన్‌, పోలీస్‌ శాఖకు చెందిన కొట్రేష్‌, అటవీ శాఖకు చెందిన జడియప్ప రక్షించారు. అటవీ శాఖకు చెందిన ఏఎస్‌ఐ మల్లేశప్ప, శ్రీకాంత్‌ బాబు, శివాండి హొన్నూరప్ప, దాసప్ప, కృష్ణ టోల్‌ శివాండి సింహాద్రి, సంగయ్య స్వామి, బీరప్ప, పశు సంవర్ధక శాఖకు చెందిన స్థానికులు దనేష్‌, హులికెరె బాబు, దుర్గేష్‌, కుమార్‌ సహాయ సహకారాలు అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement