శివాజీనగర: బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లాలో మిగులు జలాల కోసం కావేరి నదిపై నిర్మించతలపెట్టిన మేకెదాటు ప్రాజెక్ట్ మీద తమిళనాడు పదేపదే అభ్యంతరం తెలియజేయడం తెలిసిందే. ఈదఫా ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా ఈ పథకాన్ని వ్యతిరేకించేలా అసెంబ్లీలో మాట్లాడారు. కావేరి జలాలను పొందడం తమిళనాడు రైతుల హక్కు, అందుచేత తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవటానికి న్యాయ పోరాటం చేపట్టాలని గవర్నర్ అన్నారు.
కావేరి నీటిని ఇస్తాం: సీఎం శివ
మేకెదాటు ప్రాజెక్ట్ విషయమై స్పందించిన సీఎం డీ.కే.శివకుమార్.. తమిళనాడు సీఎంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాను, మనందరం కూడా భారతీయులు, తమిళనాడుకు ఇవ్వాల్సిన నీటిని తాము ఇస్తాం, ముందుగా నీటిని నిల్వ చేసుకుని, వారికి నీరు ఇస్తాం. మేం బతకాలి. వారు కూడా బతకాలి అని అన్నారు.
అన్ని అనుకూలతలను పరిగణించి తమిళనాడుకు చట్ట ప్రకారం కావేరి జలాలను ఇస్తామని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్‌కు ఏం చెప్పాలో అది చెబుతామని, ఇందులో రాజకీయం ఏమి లేదన్నారు. కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ను సుఫ్రీంకోర్టు 2025 నవంబర్‌లో కొట్టివేసిందని తెలిపారు.
అడ్డుకోవాలన్న తమిళనాడు గవర్నరు
ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తా: డీకే శివ


