బాలునిపై కుక్కల దాడి | - | Sakshi
Sakshi News home page

బాలునిపై కుక్కల దాడి

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు

తుమకూరు: నిత్యం ఎక్కడో ఓ చోట పిల్లలను కుక్కలు కరుస్తున్నాయి. జిల్లాలోని చిక్కనాయకనహళ్లి పట్టణం, జోగిహళ్లిలోని ఆది ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గురువారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఒడిశాకు చెందిన 5 ఏళ్ల బాలుడు అరుణ్‌పై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని కరిచి ఈడ్చుకెళ్లాయి. బాలుని కేకలు విన్న స్థానికులు వెంటనే కుక్కలను తరిమికొట్టి అతడిని రక్షించారు. తాలూకా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానిక గృహిణి నిర్మల మాట్లాడుతూ, పిల్లలను ఒంటరిగా దుకాణానికి పంపడానికే భయంగా ఉందని తెలిపింది. పిల్లల చేతుల్లో తినుబండారాలు చూడగానే కుక్కలు కరవడానికి దూసుకొస్తాయని ఆమె వాపోయింది. మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని, ఇప్పటికై నా చర్యలు తీసుకోకుంటే ధర్నాలు చేస్తామని తెలిపింది. తహసీల్దార్‌ ఎం.మమతా ఆస్పత్రిలో బాలున్ని పరామర్శించారు. తీవ్ర గాయాల పాలైన బాలున్ని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం వస్తే ఇలా జరిగిందని వాపోయారు.

మఠంలో బంగారం

దొంగ అరెస్టు

శివమొగ్గ: తీర్థహళ్లి తాలూకాలోని మాలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహిషి గ్రామంలో ఉన్న సత్యసంధ గురు ఉత్తరాది మఠంలో జరిగిన కోట్ల రూపాయల విలువైన బంగారం దొంగతనం కేసులో నిందితుడు దొరికాడు. శివమొగ్గలోని గాంధీనగరకు చెందిన రాఘవేంద్ర ఆచార్య (25)ను అరెస్టు చేసి 780 గ్రాముల బరువున్న 16 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు తీర్థహళ్లి డీఎస్పీ అరవింద్‌ కలగంజి తెలిపారు. బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా మఠంలో ఎంతమొత్తంలో బంగారం పోయిందన్నది బయటకు చెప్పడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement