కప్పల కూరకు లొట్టలు | - | Sakshi
Sakshi News home page

కప్పల కూరకు లొట్టలు

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

యశవంతపుర: పర్యాటకుల కేంద్రమైన గోవాలో వానాకాలం ప్రారంభం అవుతుండగానే జంపింగ్‌ చికన్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. అంటే కప్పల మాంసం అన్నమాట. అవి గంతులేస్తూ వెళ్తాయి కాబట్టి అలా పిలుచుకుంటారు. గోవాలో కప్పల వేటను నిషేధించగా, పొరుగున కార్వార నుంచి కప్పలు సరఫరా అవుతుంటాయి.

ఒక్కోటి 6 కేజీల పైనే

వాన చినుకులు పడగానే పశ్చిమ ఘాట్లలో కప్పలు బెకబెకమంటూ సంతానోత్పత్తికి బయటకు వస్తాయి. ఇవి మామూలు కప్పలైతే కాదు, ఒక్కోటి 6 నుంచి 8 కేజీల వరకు బరువుండే జంబో మండూకాలు. ఒక ఫారం కోడికి సమానంగా పెరుగుతాయి. వాటిని కొందరు స్థానికులు పట్టుకుని గోవాలో విక్రయిస్తారు. ప్రాణాలతో ఉన్న కప్పలను గోవాలో పెద్దపెద్ద హోటల్స్‌కు సరఫరా చేస్తారు. కేజీ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది. కప్ప కాళ్లతో రుచికరమైన కబాబ్స్‌, ఫ్రైస్‌ చేస్తారు. కోడి కూర కంటే చాలా రుచిగా ఉంటుందని గోవా ప్రజలు చెబుతారు. ఇప్పుడు కార్వారలో కప్పల వేట ఊపందుకుంది.

గోవాకు కార్వార నుంచి మండూకాల ఎగుమతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement