ఇంకా వీడని అస్పృశ్యత | - | Sakshi
Sakshi News home page

ఇంకా వీడని అస్పృశ్యత

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

బొమ్మనహళ్లి: సమాజంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, కుల వ్యవస్థ, బానిసత్వం, అంటరాని తనం వంటివి ఇంకా కొనసాగుతున్నాయని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ మనవరాలు రమ అంబేడ్కర్‌ విచారం వ్యక్తం చేశారు. చన్నపట్టణ నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలు నిర్వహించిన భీమోత్సవ్‌, ప్రతిభా పురస్కార్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విద్య, రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని బోధించారు. కానీ రాజ్యాంగ ఆకాంక్షలు కొద్దిమందికే పరిమితమయ్యాయి. అంబేడ్కర్‌ సూత్రాలు, సిద్ధాంతాలు నిరుపయోగంగా మారాయి. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన విద్య అందడం లేదు అని పేర్కొన్నారు. ఇటువంటి లోపాలను సరిదిద్దడానికి ఓటు హక్కు అనే గొప్ప ఆయుధం ఉంది, ఓటు హక్కు, పోరాటం ద్వారా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంబేడ్కర్‌ మనవరాలు రమ అంబేడ్కర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement