
నగరంలో నేడు పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు కొత్త ఏబీస్విచ్‌లు ఏర్పాటు చేస్తున్నందున శనివారం ఉ.8 నుంచి 11 గంటల వరకు 11కేవీ టవర్,సర్కిల్, డీఎఫ్‌వో ఫీడర్ల పరిధి లోని రాజీవ్‌చౌక్, రూర ల్ పోలీస్‌స్టేషన్, భారత్ టాకీస్, టవర్‌సర్కిల్, బ్రా హ్మణవీధి, అమ్మద్‌పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్, సీఎంఆర్ రోడ్, డీఎఫ్‌వో జంక్షన్, వేంకటేశ్వర ఆలయం, జైలు పెట్రోల్‌బంక్, సవరన్ స్ట్రీట్, రాజా థియేటర్ ప్రాంతాలు, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11కేవీ.కమాన్ ఫీడర్ పరిధిలోని హుందాయ్, ఫోర్డ్ షోరూంలు, పోచమ్మ కమాన్, కోతి రాంపూర్, లక్ష్మీనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఉదయం 9.30నుంచి 11.30 గంటల వరకు 32/11కేవీ.విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని సప్తగిరికాలనీ, స్కూల్, మాచర్ల గార్డెన్, బ్రిందావన్ అపార్టుమెంట్, అంజుమ్ కాంప్లెక్స్, అయోధ్య కాలనీ, వేంకటేశ్వరకాలనీ, కట్టరాంపూర్, వాసుదేవ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ లావణ్య తెలిపారు.
కొత్తపల్లి, రూరల్ పరిధిలో..
విద్యుత్ సబ్‌స్టేషన్లలో నెలవారి విద్యుత్ మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు 33/11 కేవీ బద్దిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలతో పాటు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్ సబ్‌స్టేషన్ పరిధిలోని శ్రీపురంకాలనీ, రజ్వీచమన్, ప్రియదర్శినికాలనీ, విజయనగర్‌కాలనీ, క్రిష్ణనగర్, ఆటోనగర్, బొమ్మకల్, చలిమెడ ఆసుపత్రి, గుంటూర్‌పల్లి, దుర్శేడ్, గోపాల్‌పూర్ గ్రామాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 33/11 కె.వీ.నగునూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని నగునూర్, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ పేర్కొన్నారు.