
ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యం!
● ముందుకు రాని విద్యాసంస్థల యాజమాన్యాలు ● రేపటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● జిల్లాలో 608 బస్సులు.. ఇంకా ఫిట్‌నెస్ కానివి 183
తిమ్మాపూర్: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. గతంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యాలు చేసిన పొరపాట్లతో ప్ర మాదాలు జరిగి.. విద్యార్థులు మరణించిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల బస్సుల నిర్వహణ విషయంలో రవాణాశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తోంది. ఏటా పాఠశాలల పునఃప్రారంభం నాటికి బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు, డ్రైవర్ల అర్హత, లైసెన్సులు, అనుభవాన్ని పరీక్షిస్తోంది. వాహనాలకు ఉండాల్సిన నియమాలు పరిశీలించిన తర్వాతే బస్సులు రోడ్డెక్కేందుకు అనుమతి ఇస్తున్నారు.
తప్పించుకునే ప్రయత్నం?
నిబంధనల ప్రకారం పాఠశాలల పునఃప్రారంభం నాటికి బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు చేయించి సిద్ధంగా ఉంచాల్సిన విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిబంధనల్లో విఫలమైనా, ఏదైనా లోపం ఉన్నా ఆర్థికంగా భారం పడుతుంద ని ఫిట్‌నెస్ పరీక్షకు దూరంగా ఉంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో తనిఖీలు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో యాజమాన్యాలు త్వరగా ఫిట్‌నెస్ చేయించాలని అధికారులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు, యాజమాన్యాలపై బాధ్యత
పిల్లల సౌకర్యం నిమిత్తం వారి తల్లిదండ్రులు బడి బస్సును ఆశ్రయిస్తారు. వారిని సురక్షితంగా తీసుకెళ్లి, తీసుకురావడం యాజమాన్యం బాధ్యత. పిల్లల చదువుకు ఉత్తమ బడి ఏదో విశ్లేషించుకునే తల్లిదండ్రులు రవాణా సదుపాయాల పరిశీలనకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. బస్సులకు అనుమతి ఉందా? సీట్లు సామర్థ్యం, ఇంజిన్, టైర్లు, ఇతర అంశాలను సరిచూసుకోవాలి లేదంటే సొంత సురక్షిత రవాణా సాధనం ఎంచుకోవాలి.
పాటించాల్సిన ప్రమాణాలు
బస్సుపై విద్యాసంస్థ పేరు. చిరునామా, ఫోన్ నంబర్ ఎడమవైపు, వెనక భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. సీటింగ్ సామర్థ్యానికి అనుగుణంగా కూర్చోబెట్టాలి. పిల్లలు ఎక్కడానికి, దిగడానికి సహాయకుడిని నియమించాలి. డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు. ఐదేళ్ల అనుభవం ఉండాలి. రక్తపోటు, మధుమేహం, కంటిచూపు వంటి పరీక్షలు మూడు నెలకోసారి వేయించాలి. ఫిర్యాదుల బాక్సు ప్రతీ బస్సులో ఏర్పాటు చేయాలి. నమోదైన వాటిని యాజమాన్యం పరిష్కరించాలి. అత్యవసర ద్వారం ఉంచాలి. రిజిస్ట్రేషన్, కాలుష్య, బీమా పత్రాలు బస్సులో ఉంచాలి. విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం కనిపించేలా అన్ని కోణాల్లో అద్దాలు ఉండాలి. డోర్‌కు సురక్షిత లాకింగ్ ఉండాలి.
జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు: 508
విద్యార్థులను తరలించే బస్సులు: 608
ఇప్పటి వరకు ఫిట్‌నెస్ అయినవి: 425
ఇంకా ఫిట్‌నెస్‌కు రానివి: 183
ఫిట్‌నెస్ తప్పనిసరి
పిల్లలు ప్రయాణించే బస్సు నిర్ణీత నిబంధనలకు లోబడి ఉండాలి. అందుకు విరుద్ధంగా ఉంటే వాహనాలు జప్తు చేస్తాం. బడులు పునఃప్రారంభమైన రోజు నుంచే తనిఖీలు మొదలవుతాయి. బస్సులు నిర్వహించే ప్రతి యాజమాన్యం నిబంధనలు పాటించాలి.
– శ్రీకాంత్ చక్రవర్తి, కరీంనగర్

ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యం!

ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యం!