నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం 9.15 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ సోమవారం తెలిపారు.
ఉద్యోగులు పాల్గొనాలి..
కామారెడ్డి అర్బన్: తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణ కార్యక్రమంలో కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఆయా శాఖల ఉద్యోగులు, టీన్జీవోస్ నాయకులు విధిగా హాజరుకావాలని టీన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు ఒక ప్రకటనలో కోరారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా
పరిశీలించాలి
మద్నూర్(జుక్కల్) : ఎన్నికల నేపథ్యంలో డ బ్బు, మద్య తరలించకుండా, ఎన్నికలు స జావుగా జరిగేలా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. డోంగ్లీ మండలంంలోని సిర్‌పూర్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సోమ వారం ఆమె తనిఖీ చేశారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనంతోపాటు కార్లు, ఇతర వాహనాలను చెక్‌పోస్ట్ సిబ్బంది తనిఖీ చేయాలన్నారు. ఆమెవెంట డోంగ్లీ రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఎస్సీ గురుకుల
అధ్యాపకులపై వేటు
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అ చ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలను జోన ల్ అధికారిణి ప్రత్యూష, డీసీవో శివరాం సో మవారం వేర్వేరుగా తనిఖీ చేశారు. గురుకు ల విద్యార్థి అజయ్ నీట మునిగి మృతి చెందిన ఘటన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇన్‌చార్జి ప్రిన్సి పాల్ గణపతికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అ లాగే ఉపాధ్యాయులు రవికాంత్, లక్ష్మణ్‌తోపాటు పీడీ రాజు, వాచ్‌మెన్ కిషన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
యాసంగి పంటలకు
‘సాగర్’ జలాలు
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి పంటల సాగు అవరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశామని బాన్సువాడ నీటి పారుదలశాఖ ఎస్‌ఈ దక్షిణమూర్తి అన్నారు. సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప రిధిలో 1.25 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు ఆరు విడతల్లో 12.5 టీఎంసీల నీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈలు సోలోమాన్, రాజశేఖర్, ఏఈలు అక్షయ్, సాకేత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 43 ఫిర్యాదులు
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 43 ఫిర్యాదులు అందాయి. ఏ వో మసూర్ అహ్మద్, అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్ లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ శా ఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ


