‘రైతు నేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, చీడ పీడల నివారణ తదితర విషయాలపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు, సలహాలు, జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే మామిడి తోటలు పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఏడీఏ లక్ష్మీప్రసన్న, మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, ఏవో సంతోష్, ఏఈవో రాకేశ్, రైతులు పాల్గొన్నారు.


