ప్రతిరోజు వ్యాయామం చేయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిరోజు వ్యాయామం చేయించాలి

Oct 24 2025 2:30 AM | Updated on Oct 24 2025 2:30 AM

ప్రతి

ప్రతిరోజు వ్యాయామం చేయించాలి

ప్రతిరోజు వ్యాయామం చేయించాలి దర్గా ఉర్సును విజయవంతం చేయండి బస్సు ట్రిప్పుల సంఖ్య పునరుద్ధరణ

బాన్సువాడ రూరల్‌: శారీరక వికలాంగులైన విద్యార్థులకు ప్రతిరోజు తల్లిదండ్రులు బాధ్యతగా భావించి వ్యాయామం చేయించాలని బాన్సువాడ మండ ల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. గు రువారం ఆయన బాన్సువాడ లోని భవిత కేంద్రంలో కొనసాగిన ఫిజియోథెరపీ శిబిరాన్ని సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులను ప్రతినెలా డాక్టర్‌ను చూపించి మందులు వేయాలన్నారు. చదువుకు వైకల్యం అడ్డు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం భవిత సెంటర్‌లు నెలకొల్పిందన్నారు. రిసోర్స్‌ టీచర్స్‌ వెంకట పద్మ, అందె అనిల్‌, మంద ప్రవీణ్‌, ఫిజి యోథెరపిస్టు గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొత్తాబాది దర్గా వద్ద ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హజ్రత్‌ సోఫి సయ్యద్‌షా, మొహ్మద్‌ అయినోద్దీన్‌ దర్గా ఉర్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు సయ్యద్‌ షా మహ్మద్‌ యూసుఫుద్దీన్‌ కోరారు. ఈ నెల 25న గంధం ఊరేగింపు, ఖవ్వాలి కార్యక్రమం ఉంటుందన్నారు. ఆదివారం దీపారాధన, మహిఫిలే సమజల్స–ఏ–ఔలియా ఖవ్వాలీ, 26న తక్మీమ్‌–ఏ తబరుకాత్‌ సాయంత్రం తిలావతే ఖురానేపాక్‌, ఫాతేహా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

భిక్కనూరు: కామారెడ్డి–రామాయంపేట మధ్య బస్సు ట్రిప్పుల సంఖ్యను పునరుద్ధరించినట్లు కాంగ్రెస్‌ నేతలు అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రుంలో కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అందె దయాకర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్‌, విండో చైర్మన్‌ గంగళ్ల భూమయ్య, తదితరులులు విలేకరులతో మాట్లాడుతూ.. పదిరోజులుగా కామారెడ్డి–రామాయంపేట మధ్య బ స్సు ట్రిప్పుల సంఖ్యను తగ్గించారని, ఈ విషయ మై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి విన్నవించగా ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, బస్సుల సంఖ్యను పునరుద్ధరింపజేశారన్నారు. కాంగ్రెస్‌ నేతలు విజయకుమార్‌గౌడ్‌, మైపాల్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, నీల అంజయ్య, చీకోటి ప్రభాకర్‌,జనార్దన్‌రెడ్డి తదితరులున్నారు.

ప్రతిరోజు వ్యాయామం చేయించాలి 
1
1/1

ప్రతిరోజు వ్యాయామం చేయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement