రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో సీనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపికలను పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించగా క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్ ప్రారంభించారు. 150 బాలికలు, 178 మంది బాలురు మొత్తం 328 మంది పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మంది బాలురు, 20 మంది బాలికలను రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారికి ఈనెల 25 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అనిల్, అధ్యక్షుడు జీవీ భూమారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అతీకుల్లా, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక


