విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
సాక్షి నెట్‌వర్క్ :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పలుచోట్ల గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్‌ను ఎలా అదుపు చేయాలి.. డ్రగ్స్ వల్ల యువత ఎలా చెడిపోతున్నారనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు అమరుల ఆత్మశాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం పోలీసు కళాబృందం సభ్యులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. అలాగే నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ సిబ్బందికి ‘పనిప్రదేశంలో లింగ వివక్షత’అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు


