అధిక పంట దిగుబడికి డ్రోన్‌లను వినియోగించాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఆధునిక టెక్నాలజీ డ్రోన్‌లను వినియోగించుకోవాలని గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్ శంకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావులు సూచించారు. మొదటగా మండల కేంద్రంలో వంగిటి రాజు(రైతు) పంటలో గాయత్రి ఎయిరో సిస్టమ్స్ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం గాయత్రి షుగర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధునాతన సాంకేతికతో డ్రోన్‌లను తయారు చేశామన్నారు. డీజీసీఏ అనుమతితో రూ.7లక్షల 50వేల విలువ గల డ్రోన్ రూ.లక్ష సబ్సిడీ ఇస్తూ.. ఇన్సూరెన్స్‌తో పాటు రూ.6లక్షల 50వేలకు అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో రోజుకు 30 నుంచి 32 ఎకరాల పంటకు స్ప్రే చేయవచ్చని సూచించారు. డ్రోన్‌లు కావల్సిన రైతులు గాయత్రి షుగర్స్‌లో సంప్రదించాలని, లేకుంటే ఫీల్డ్ మెన్‌లను సంప్రదించాలని సూచించారు. చెరుకు సాగుకు రైతులకు అనేక రాయితీలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైలట్‌కు ఉచితంగా శిక్షణను కూడా ఇస్తామన్నారు. మార్కెటింగ్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, ఏవో రమేశ్, విండో చైర్మన్ కమలాకర్ రావు, రైతులు పాల్గొన్నారు.


