ప్రధాన కారణాలివే..!
జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, గౌడ కులస్తులకు 7, ఓపెన్ కేటగిరి కింద 35 వైన్‌షాపులను కేటాయించారు. దుకాణాల నిర్వహణకు అయ్యే ఖర్చు రోజురోజుకి పెరుగుతుండగా లాభం తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు. తమకు మొదటి రూ.2 కోట్ల అమ్మకాలపై ప్రభుత్వం నుంచి 12 శాతం లాభాన్ని ఇస్తారని.. రూ.2 కోట్ల విక్రయాల తర్వాత ఇచ్చే కమిషన్ అమాంతం 4 శాతానికి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు ఎక్కువగా ఉండే వైన్‌షాపులకు రూ.2 కోట్ల వ్యాపారం మొదటి 3 నుంచి 4 నెలల్లోలే పూర్తవుతుంది. కానీ ఖర్చులు ఎప్పటికీ ఉండేవే. దీంతో ఖర్చులు ఎక్కువ.. లాభం తక్కువ అనే భావన వ్యాపారుల్లో పెరుగుతోంది. దీనికి తోడు దరఖాస్తు రుసుమును ప్రభుత్వం ఈ సారి రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది.


