కుక్కను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
● ఒకరి మృతి
బోధన్‌రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పింబోయిన ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు బోధన్‌రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వెండి లక్ష్మణ్(37) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పొలంలో కోసిన వడ్లను ట్రాక్టర్ ద్వారా రైస్‌మిల్‌కు తరలిస్తుండగా గ్రామ శివారులో రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను త ప్పింబోయి ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాదంలో లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కు టుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విద్యుత్‌షాక్‌తో రైతు ..
ఎల్లారెడ్డిరూరల్: వ్యవసాయ పొలంలో చెడిపోయిన బోరుబావి స్టాటర్ డబ్బాను రిపేర్ చేస్తుండగా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన కొండ అమృత్‌రావు(48) అనే రైతు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అమృత్‌రావు పొలం పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. బుధవారం తన వ్యవసాయ పొలంలో బోరుబావి మోటరు పనిచేయకపోవడంతో స్టాటర్ డబ్బాను విప్పి రిపేరు చేస్తున్నా డు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చికిత్స పొందుతూ మహిళ..
తాడ్వాయి: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళచికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తాడ్వాయి ఎస్సై న రేశ్ తెలిపారు.వివరాలిలా ఉన్నాయి.మండలంలోని సోమావారం తండాకు చెందిన భూక్య కమిలి(32) అనే మహిళ కొన్నేళ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తితో ఈనెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


