పన్ను వసూలు వేగవంతం చేయండి
● డీపీవో శ్రీనివాస్‌రావు
బోధన్: గ్రామ పంచాయతీ పరిధిలో ఆస్తి, ఇతర పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు వంద శాతం పన్ను వసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధవారం సాలూర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. డీఎల్‌పీవో నాగరాజు, ఎంపీడీవోలు శ్రీనివాస్, మధుకర్, ఎంపీవో మద్దిలేటి, తహసీల్దార్ శశిభూషణ్‌తో సమావేశమయ్యారు. పంచాయతీ పాలనకు సంబంధించిన అంశాల పై చర్చించారు. అనంతరం నర్సరీని సందర్శించి నాటిన మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సిరికొండ: మండల కేంద్రంలోని దళితవాడ వైకుంఠధామంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని సంఘం సభ్యులు వాపోతున్నారు. గోసంగి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో అంత్యక్రియలు నిర్వహించామని వారు వాపోయారు. రోడ్డు సరిగా లేదని, నీటి సౌకర్యం లేదని వారు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని పాలకులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పన్ను వసూలు వేగవంతం చేయండి


