నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణం
● బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వరదలతో పంటలు నష్టపోయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా చేపట్టిన అయ్యప్ప ఆలయ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణదశలో ఉన్న ఆలయ వివరాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల రెండు పండుగలు గడిచిపోయినా వరద బాధితులకు నష్టపరిహారం అందకపోవడం విచారకరమన్నారు. వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంపై లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు హన్మాండ్లు, దేవిసింగ్, రాజు, విష్ణు తదితరులున్నారు.


