ఫారెస్ట్ అధికారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
రాజంపేట: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అకారణంగా తమను వేధింపులకు గురిచేస్తున్నాడంటు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజంపేట మండలం శేర్‌శంకర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన కాట్రోత్ సుభాష్ అనే వ్యక్తిని గతేడాది ఓ కేసు విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్ బాబా అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతేకాకుండా కేసు విషయంలో ట్రాక్టర్‌ను సైతం కోర్టులో హాజరుపర్చినట్లు సుభాష్ పేర్కొన్నాడు. బుధవారం తిరిగి సెక్షన్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా సుభాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి యత్నించాడు. గమనించిన కుటుంబీకులు కామారెడ్డి ఆస్పత్రికి త రలించారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌ను ‘సా క్షి’ వివరణ కోరగా గతంలో ఉన్న కేసులో భాగంగానే అధికారులు సుభాశ్ ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకోడానికి ఇంటికి వద్దకు వెళ్లారని తెలిపారు.


