అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టం
భిక్కనూరు:దేవాలయాల అభివృద్ధిలో భాగస్వా మ్యం అవడం పూర్వజన్మ సుకృతంగా తాను భావిస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం పునర్నిర్మాణకమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో షబ్బీర్‌అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌తో కలిసి పాల్గొన్నారు. వీరికి ఆలయం తరపున వేద బ్రాహ్మణులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మలు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మా ట్లాడుతూ..తాను 1992లో భిక్కనూరు సిద్దరామేశ్వరాలయానికి మండల కేంద్రం నుంచి బీటీరోడ్డు, టీటీడీ కల్యాణం మండపాన్ని నిర్మించానని తెలియజేశారు. తాను మంత్రిగా వైఎస్సార్ హయాంలో ప నిచేసినప్పుడు నియోజకవర్గంలో చాలా ఆలయాలను దూపదీప నైవేద్య పథకంలో చేర్పించానన్నా రు.వేదబ్రాహ్మణులు,పండితుల ఆశీర్వచనాలు దే వుళ్ల ఆశీస్సులతోనే తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు.హైకోర్టు న్యాయవాది పెద్దబచ్చగా రి రాంరెడ్డి సిద్ధరామేశ్వరాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని ఆయనను అభినందించారు. పునర్‌నిర్మాణ కమిటీ సభ్యులు నిజాయితీగా పనిచేసి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆలయం అభివృద్ధికి తాను ముందుంటానని రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయం మహంత్ సదాశివ మహంత్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, నేతలు బల్యాల సుదర్శన్, బల్యాల రేఖ, జాంగారి గాలిరెడ్డి, తొగరి సుదర్శన్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి, వైస్‌చైర్మన్ అందె దయాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
షబ్బీర్ తోడ్పాటు అభినందనీయం:
ఎంపీ షెట్కార్
షబ్బీర్‌అలీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కొనియాడారు. నూతన దేవాలయాలను నిర్మించడం కంటే పురాతన దేవాలయాలను అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. సిద్దరామేశ్వరాలయం అభివృద్దికి రూ.5 లక్షలను తన ఎంపీ నిధుఽల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ


