రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంతోపాటు గుర్జాల్, మాతుసంగెం, పేట్‌సంగెంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కల్లాల్లో ధాన్యం తేమ 40 నుంచి 50 శాతం వస్తోందని 17 శాతం తేమ వచ్చేవరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఆయన వెంట గాంధారి విండో ఇన్‌చార్జి సీఈవో సాయిలు, రైతులు, సిబ్బంది ఉన్నారు.


