బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌ | - | Sakshi
Sakshi News home page

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌

Oct 22 2025 7:16 AM | Updated on Oct 22 2025 7:16 AM

బార్‌

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌ పాల్వంచ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్‌ రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు కల్వర్టుకు మరమ్మతులు ప్రారంభం రెండు ఇసుక లారీల పట్టివేత

కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ బార్‌ అసోసియేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉ పాధ్యక్షుడిగా కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నంద రమేశ్‌ ఎన్నికయ్యారు. నాంపల్లి కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహించగా నిజామా బాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.సాయిరెడ్డి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికై న ట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేశ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

మాచారెడ్డి: పాల్వంచ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా తోట బాల్‌రాజు, ఉపాధ్యక్షులుగా రమేష్‌ యాదవ్‌, నాగయ్య, కోశాధికారిగా శంకర్‌లను ఎన్నుకున్నారు.

● సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డీఎం శ్రీకాంత్‌

కామారెడ్డి క్రైం: ‘సాక్షి’ దినపత్రికలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు అనే శీర్షికతో ఆదివారం(ఈ నెల 19న) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డీఎం శ్రీకాంత్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండలంలో మొత్తం 38 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇంకా రావడం లేదని, 5 కేంద్రాలకు మాత్రమే ధాన్యం కుప్పలు వచ్చాయన్నారు. తేమ శాతం నిబంధనల ప్రకారంగా లేకపోవడంతో రైతులు ధా న్యాన్ని ఆరబెడుతున్నారని తెలిపారు. అందుకే కాంటా ప్రారంభం కాలేదన్నారు. 7 కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో గన్నీ బ్యాగులు పంపలేదన్నారు. తొందర్లోనే అన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్‌ శివారులోని ప్రధాన రోడ్డుపై కోతకు గురైన కల్వర్టు మరమ్మతుల పనులను మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్‌ ప్రారంభించారు. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు కోతకు గురైంది. దాంతో కోమట్‌పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్‌, రాంపల్లితండా, పొల్కంపేట గ్రామాలతో పాటు మెదక్‌ వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆదేశాల మేరకు కల్వర్టుకు మరమ్మతులు చేసి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. నాయకులు సంగయ్య, భైరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

బీబీపేట: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక లారీలను సోమవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక ధరకు అమ్మడానికి ములుగు జిల్లా, మరొకటి కరీంనగర్‌ జిల్లాల నుంచి బీబీపేటకు వస్తుండగా, యాడారం రోడ్డులో ఒక లారీని పట్టుకున్నామన్నారు. అలాగే మరోక లారీని పెద్దమ్మ ఆలయం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లను విచారించగా సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు.

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌ 
1
1/4

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌ 
2
2/4

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌ 
3
3/4

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌ 
4
4/4

బార్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement