రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజేత గాంధారి జట్టు
కామారెడ్డి అర్బన్:సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్రస్థా యి రెండు రోజుల ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ సోమవారం రాత్రి ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి విజేత జట్ల కు బహుమతులు,ట్రోఫీలు అందజేశారు. ప్రథమంగా నిలిచిన గాంధారి జట్టుకు రూ.20వేల నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పిట్లం జట్టుకు రూ.10వేల నగదు, తృతీయ స్థానంలో నిలిచిన తాడ్వాయి జట్టుకు రూ.5వేల న గదు అందజేశారు.పాల్గొన్న క్రీడాకారులకు జ్ఞాపికలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరేష్, మహేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్, మనోహర్‌రావు, బాబా, జగదీష్, మురళి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీల్లో పేట్‌సంగెం విద్యార్థిని ప్రతిభ
గాంధారి(ఎల్లారెడ్డి): రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అండర్–17 బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లక్ష్మణ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రస్థాయి ఉమ్మడి నిజామాబాద్ జట్టులో జెడ్పీ ఉన్నత పాఠశాల పేట్‌సంగెం విద్యార్థిని సృజన మంచి ప్రతిభ కనబర్చి నిర్వాహకుల దృష్టిని ఆకర్షించి ప్రశంసా పత్రం అందుకున్నట్లు తెలిపారు. సృజనను పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజేత గాంధారి జట్టు


