ఏసీబీ దాడిచేసిన సలాబత్‌పూర్ ఆర్టీవో చెక్‌పోస్ట్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అవి చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్లు అనేకంటే కలెక్షన్ సెంటర్లు అనొచ్చు. ఎందుకంటే అక్కడ వాహనాల తనిఖీలు ఉండవు. కేవలం వసూళ్లే జరుగుతాయి. అది కూడా బహిరంగంగా నడిచే వ్యవహారమే. ఈ విషయం రవాణా శాఖ ఉన్నతాధికారులకు తెలియందీ కాదు. పైగా చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్లలో ప్రైవేటు వ్యక్తులే వ సూళ్ల బాధ్యతలు చూసుకుంటారు. వాళ్లే లెక్కలు క ట్టి అధికారులకు అప్పగిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యం. అయితే ఏసీబీ అధికారులు అప్పుడప్పు డు దాడులు చేయడం, వాళ్ల ఎదుటే సరుకు రవాణాకు సంబంధించిన వాహనదారులు డబ్బులు తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసి వెళ్లడం సర్వ సాధారణమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై భిక్కనూరు మండలం పొందుర్తి వద్ద ఉన్న చెక్‌పాయింట్‌పై, అలాగే 161వ నెంబర్ జాతీయ రహదారిపై మద్నూర్ మండలం సలాబత్‌పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల ఎదుటే వాహనదారులు డబ్బులు తెచ్చి బాక్సుల్లో వేసి వెళ్లారు. భిక్కనూరు మండలం పొందుర్తి వద్ద చెక్‌పాయింట్‌లో రూ.51,300 అలాగే మద్నూర్ మండలం సలాబత్‌పూర్ వద్ద చెక్‌పోస్టులో రూ.36 వేల నగదును సీజ్ చేశారు.
చెక్ పోస్టుల వద్ద డ్రైవర్లు డబ్బులు
వేసేందుకు బాక్సుల ఏర్పాటు
ప్రైవేటు వ్యక్తులతో దర్జాగా వసూళ్లు
మారని రవాణా శాఖ తీరు
మరోసారి దాడులు చేసిన ఏసీబీ
ఓపెన్ కలెక్షన్!


