మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
● ఈ నెల 23 వరకు అవకాశం
కామారెడ్డి రూరల్: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు కామారెడ్డి ఎకై ్సజ్ శాఖ అధికారి హనుమంత రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం మొదట ఈ నెల 18 వరకే గడువు విధించింది. అయితే, శనివారం రాత్రి వరకు మొత్తం 1,444 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కామారెడ్డి పరిధిలో 449, దోమకొండ పరిధిలో 307, బిచ్కుంద పరిధిలో 222, బాన్సువాడ పరిధిలో 240, ఎల్లారెడ్డి పరిధిలో 226 దరఖాస్తులు వచ్చాయి. మరో ఐదు రోజులపాటు గడువు పొడిగించడంతో ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ అధికారి హనుమంతరావు తెలిపారు. ఈ నెల 27న లాటరీ నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వ స్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజె క్టు ఒక వరద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు(17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో సీనియర్ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపిక ఈనెల 23న గురువారం ఉదయం 9గంటలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అతీకుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు ఈ నెల 25 నుంచి నవంబర్ 5 వరకు పిట్లంలో ప్రత్యేక శిబిరం నిర్వహించి నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు పెద్దపల్లి ఇండియన్ మిషన్ హైస్కూల్‌లో నిర్వహించే 58వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. వివరాలకు 85559 96271, 94942 259901, 96762 69988 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.
● ఎస్పీ రాజేశ్‌చంద్ర
కామారెడ్డి క్రైం: దీపావళి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర జిల్లా ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. బాణాసంచా కాల్చేటప్పుడు గాయాలు కాకుండా, అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లను అలంకరించే క్రమంలో దీపాలు, లైటింగ్ ఏర్పాట్లు విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. శబ్ద, కాలుష్య నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, పరిమితులను తప్పనిసరిగా పాటించాలన్నారు.
● జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్
కామారెడ్డి రూరల్: లైసెన్స్ ఉన్న షాపులలో మాత్రమే పటాకులు కొనుగోలు చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ ప్రజలకు సూచించారు. జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 94 పటాకుల దుకాణాలకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం, ప్రతి షాపు వద్ద 200 లీటర్ల నీటి బ్యారెల్, 5 కిలోల ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఉండాలని తెలిపారు. ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. రోడ్లు, ఇళ్ల మధ్య పటాకులు కాల్చొద్దని, ఓపెన్ స్థలాల్లో మాత్రమే కాల్చాలన్నారు.
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు


